అనుపమ, జీవా లాక్‌డౌన్‌... ట్రైలర్‌

కోలీవుడ్‌ దర్శకుడు ఏఆర్ జీవా స్వీయ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి చేసిన ‘లాక్‌డౌన్‌’ ట్రైలర్‌ నేడు విడుదలైంది. కరోనా మహమ్మారి దేశంపై విరుచుకుపడినప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

ఈ లాక్‌డౌన్‌పై ఇప్పటికే అనేక సినిమాలు, వెబ్‌ సిరీస్‌ వచ్చాయి. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు లాక్‌డౌన్‌ అంటూ అనుపమ, జీవా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఛార్లీ, నిరోష, ప్రియ వెంకట్, లివింగ్ స్టన్, ఇందుమతి, రాజ్ కుమార్‌, శ్యామ్‌ జీ, లోల్లు సభ మరాన్ రేవతి, ప్రియ గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.  

ఈ సినిమాకి దర్శకత్వం: ఏఆర్ జీవా, సంగీతం: ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్, కెమెరా: కేఏ శక్తివేల్, ఎడిటింగ్:విజే సాబు జోసఫ్, కోరియోగ్రఫీ: షెరీఫ్, శ్రీ గిరీష్, స్టంట్స్: ఓం శివ ప్రకాష్ చేశారు. 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జికేఎం తమిళ్ కుమారన్ నిర్మించిన లాక్‌డౌన్‌ 5 డిసెంబర్‌ 5న విడుదల కాబోతోంది.