జయకృష్ణ తొలి సినిమా పేరు శ్రీనివాస మంగాపురం

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు స్వర్గీయ రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. 

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే పేరు ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇది తిరుపతి పట్టణంలో ఓ ప్రేమ కధ అంటూ సినిమా కధ క్లుప్తంగా చెపుతూ ఏడుకొండలు చిత్ర పటం వేశారు. తిరుపతి పట్టణంలో కధ కనుక ‘శ్రీనివాస మంగాపురం’ పేరు చక్కగా సరిపోతుంది.  

ఈ సినిమాలో జయకృష్ణకు జోడీగా ప్రముఖ నటి రవీనా టండన్ కుమార్తె రష తడాని నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌ అందించబోతున్నారు. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై జెమినీ కిరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ ప్రకటించారు కనుక త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.