
రేణూ దేశాయ్ చివరిగా చేసిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. ఈ సినిమాలో రవితేజ బందిపోటు దొంగగా నటించగా రేణూ దేశాయ్ సామాజిక కార్యకర్త హేమలత లవణం పాత్ర చేశారు. మళ్ళీ ఇన్ని నెలల తర్వాత ఆమె మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో ‘పదహారు రోజుల పండగ’ సినిమా చేయబోతున్నారు. సాయి కిరణ్ ఇదివరకు కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలతో మంచి దర్శకుడుగా గుర్తింపు సంపాదించుకున్నారు.
2008లో నితిన్ హీరోగా చేసిన ద్రోణ సినిమాలో బాలీవుడ్‌లో నటుడుగా చేసి నంది అవార్డ్ గెలుచుకున్న సాయి కృష్ణ దమ్మాలపాటి ఈ సినిమాలో హీరోగా, గోపికా ఉద్యాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్, కృష్ణుడు, విష్ణు, అనసూయ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. రేణూ దేశాయ్ తాను మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటిస్తూ సహా నటీనటులతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశారు.
సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడవి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించబోతున్నారు.