పూజా కార్యక్రమంతో బాలకృష్ణ 111 సినిమా షురూ

గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ-నయనతార జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించిన ‘ఎన్‌బీకె 111’ సినిమాకి బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక ఆకట్టుకునే పోస్టర్‌ విడుదల చేశారు.

ఇది చారిత్రిక నేపధ్యంతో తీయబోతున్న సినిమా. కనుక పోస్టర్లో బాలకృష్ణ రాజుగారి వేషంలో ఆయుధాలు పట్టుకొని మరో వీరుడితో యుద్దానికి సిద్ధం అయిన్నట్లు చూపారు. రెండు కోట బురుజుల మీద ఇద్దరూ ఆయుధాలు పట్టుకొని నిలబడినట్లు చూపారు.

బాలకృష్ణ ఒక చేతిలో పడవల లంగరుని పట్టుకున్నట్లు, కోట దిగువన, పక్కన  సముద్ర కెరటాలు ఉన్నట్లు చూపారు. బాలకృష్ణతో యుద్ధానికి సిద్దమైన రెండో వ్యక్తి కూడా ఆయననే పోలి ఉన్నారు. కనుక దీనిలో బాలకృష్ణ ద్విపాత్రభినయం చేస్తున్నారేమో? అనే సందేహం కలుగుతుంది. త్వరలోనే రామానాయుడు స్టూడియోలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.     

చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.