
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర చేసిన అఖండ-2 వచ్చే నెల 5న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు.
ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ శుక్రవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అఖండ-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా శ్రేయాస్ శ్రీనివాస్ తెలియజేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంటలతో కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అఖండ-2 నిర్మించి డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు.