
మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి మొదటి పాట భీమవరం బల్మా గురువారం విడుదల చేయబోతున్నారు. విశేషమేమిటంటే ఈ పాటను నవీన్ పోలిశెట్టి స్వయంగా పాడారు. ఇటీవలే ఈ పాట రికార్డింగ్ పూర్తయింది. కనుక 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అనగనగా ఒక రాజు వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ పాటతో ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేస్తున్నారు.