
మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ నేడే విడుదలవుతోంది. హైదరాబాద్, బాలానగర్ వద్ద విమల్ థియేటర్‌లో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఫస్ట్ సింగిల్ లాంచింగ్ ఈవెంట్ మొదలవుతుంది. కనుక మరికొద్ది సేపటికి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది. ఈ విషయం తెలియజేస్తూ చిత్ర బృందం ప్రభాస్ పోస్టర్ మరొకటి వేసింది. కింద ఇచ్చిన యూట్యూబ్ లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో చూడవచ్చు.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. రాజాసాబ్ జనవరి 9న సంక్రాంతి పండుగ ముందు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.