కె.టి.ఆర్ గెస్ట్ గా మెగా ఈవెంట్..!

మెగా పవర్ స్టార్ నటించిన ధ్రువ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 4న జరుగనున్న ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కె. తారక రామారావు వస్తున్నారట. ఈమధ్యనే 10కె రన్ లో పాల్గొనడమే కాకుండా చరణ్ తో సెల్ఫీ దిగిన కె.టి.ఆర్ సినిమా వాళ్లతో కాస్త చనువుగా ఉంటున్నారు.  

రాం చరణ్ తో క్లోజ్ గా ఉండే కె.టి.ఆర్ ధ్రువ మెగా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ప్రత్యేకంగా పోలీస్ గ్రౌండ్స్ లో పెట్టడానికి కారణం సినిమా పోలీస్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న సినిమా అని తెలుస్తుంది. అయితే పోలీస్ శాఖలోని కొందరు ఉన్నత అధికారులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేనా మెగా ఈవెంట్ ఏదైనా మెగా హీరోల సందడి కన్ఫాం. మెగాస్టార్ చిరంజీవి కూడా కచ్చితంగా ఫంక్షన్ లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.    

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందించారు.