వారణాశిలో మొత్తం ఆరు పాటలు: కీరవాణి

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాశి’ టైటిల్‌ ఫస్ట్ గ్లిమ్స్‌తోనే సినిమాకి చాలా హైప్ ఏర్పడింది. ఇటీవల ‘రణ కుంభ’ థీమ్‌ సాంగ్‌ విడుదల చేస్తే అదీ వైరల్ అయ్యింది. రాజమౌళి సినిమా అంటే షూటింగ్ పూర్తయ్యే వరకు నటీనటులు కూడా బయట ఎవరికీ కనపడనీయరు.

కానీ ఈసారి మహేష్ బాబుని ఫ్రీగా వదిలేశారు. ఇంకా సినిమా షూటింగ్‌ 20-30 శాతం కూడా పూర్తికాక ముందే టైటిల్‌ ప్రకటించారు. పాత్రలను పరిచయం చేశారు. టైటిల్‌ గ్లిమ్స్‌లో సినిమా ఎలా ఉండబోతోందో కూడా శాంపిల్ చూపించేశారు.

ఇప్పటి నుంచే వారణాశి అప్‌డేట్స్ అందిస్తూ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కొత్త మార్పులే కానీ అందరికీ సంతోషం కలిగిస్తున్నాయి. 

తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని చెప్పేశారు. సినిమా కధ, షూటింగ్, పాత్రలు ఏ విషయంలో కూడా ఎటువంటి సందిగ్దత లేదని అందరూ పూర్తి క్లారిటీతో పని చేస్తున్నామని కీరవాణి చెప్పారు. 

ఇది వారణాసి (కాశీ)తో ముడిపడిన అడ్వంచర్ సినిమా అని ఫస్ట్ గ్లిమ్స్‌తో చూపించారు. ఈ సినిమాలో మందాకినిగా బాలీవుడ్‌ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా, విలన్‌గా కుంభగా ప్రముఖ మళయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. 

కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్‌: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్‌, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు. 

ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు. 

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా  నిర్మిస్తున్నారు. 2027 వేసవిలో వారణాశిని చూడవచ్చు.