
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్ర చేసిన అఖండ-2 ట్రైలర్ శుక్రవారం కర్ణాటకలోని చిక్ బళ్ళాపూర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కన్నడ సూపర్ స్టార్ డా.శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలయ్య బాబు, డా.శివరాజ్ కుమార్ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ చేయాలని, దానికి బోయపాటి దర్శకత్వం వహించాలని కోరారు.
డా.శివరాజ్ కుమార్ స్పందిస్తూ ‘నేను రెడీ’ అనగా బాలయ్య స్పందిస్తూ ‘మేమిద్దరం రెడీ’ అని జవాబిచ్చారు. బోయపాటి స్పందిస్తూ ‘నేను డబల్ రెడీ” అనేసరికి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు సంతోషంతో ఈలలు కేకలు వేస్తూ హర్షధ్వానాలు చేశారు.
మల్టీ స్టారర్ ప్రకటించారు కానీ ఇద్దరు పెద్ద హీరోలకు సరిపడే మంచి కధ సిద్దం చేయాలి. తర్వాత ఇద్దరూ డేట్స్ సర్దుబాటు చేసుకొని దీని కోసం తగినంత సమయం కేటాయించాలి. ఇదంతా ముగిసిన తర్వాత పూజా కార్యక్రమం, షూటింగ్ మొదలవదానికి మరో ఆరు నెలలు సమయం పట్టవచ్చు.
అఖండ-2 డిసెంబర్ 5న విడుదలైన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య, నయనతార జంటగా ఎన్‌బీకే 111 వర్కింగ్ టైటిల్‌తో చారిత్రిక నేపధ్యంతో సినిమా మొదలుపెట్టబొతున్నారు.
అది పూర్తయిన తర్వాత మళ్ళీ బోయపాటికి సమయం కేటాయించగలరు. అంటే య్యేసరికి 2026 జూన్, జూలై నెలల్లో ఈ మల్టీ స్టారర్ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
బోయపాటి డైరెక్షన్ లో
మల్టీస్టారర్ ఫిక్స్...#BoyapatiSreenu #ShivaRajkumar pic.twitter.com/w9qCenZDkJ