వెరైటీగా ఆంధ్రా కింగ్‌ తాలూకా ప్రమోషన్స్‌

మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా నటించిన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ మరో 5 రోజులలో అంటే నవంబర్‌ 27న విడుదల కాబోతోంది. కనుక చిత్ర బృందం కాస్త వెరైటీగా సినిమా ప్రమోషన్స్‌ నిర్వహిస్తోంది.

ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటల నుంచి విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ మ్యూజిక్ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతోంది. హీరో, హీరోయిన్లు రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. చల్లటి సాయంత్రం వేళ బీచ్ ఒడ్డున ఇలాంటి కార్యక్రమం అంటే     

ఇది  ఓ అభిమాని బయోపిక్ అని దర్శకుడు మహేష్ బాపు ముందే చెప్పేశారు. అలాంటి వీరాభిమాని కోసం హీరో వచ్చి అండగా నిలబడినట్లు ట్రైలర్‌లో చూపారు.  

ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మహేష్ బాబు బాపు, పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: సిద్ధార్థ్ నుని, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేశారు.  

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలసి నిర్మించిన‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నవంబర్‌ 27న విడుదల కాబోతోంది.