రాజాసాబ్‌ ఫస్ట్ సింగిల్ ఒకరోజు ముందుగానే!

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘రాజాసాబ్’ టీజర్‌, ట్రైలర్‌లతో అభిమానులు చాలా హ్యాపీ! ఇప్పుడు రాజాసాబ్ పాటల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. రాజాసాబ్‌ ఫస్ట్ సింగిల్ మొదట సోమవారం విడుదలవుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఒక రోజు ముందుగా అంటే ఈ ఆదివారమే విడుదల కాబోతోంది.

శ్రేయాస్ శ్రీనివాస్ ఈ విషయం తెలియజేస్తూ ప్రభాస్‌ ఫోటోతో ఓ పోస్టర్‌ కొద్ది సేపటిక్రితం విడుదల చేశారు. ప్రభాస్‌ రంగురంగుల చొక్కా, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ గాగుల్స్ ధరించి గ్రూప్ డాన్స్ చేస్తున్న ఫోటో చూసి అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. ఇక పాట ఎలా ఉంటుందో... దానిలో ప్రభాస్‌ డాన్స్ ఎలా ఇరగదీస్తారో? చూడాల్సిందే! 

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. రాజాసాబ్ జనవరి 9న సంక్రాంతి పండుగ ముందు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.