
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ జనవరి 9న విడుదల కాబోతోంది. అంటే మరో రెండు నెలల్లో... కనుక సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేసినట్లే! ఇప్పటికే టీజర్, ట్రైలర్ వచ్చేశాయి.
వాటిని చూసి అభిమానులు కూడా హ్యాపీ! ఇప్పుడు రాజాసాబ్ పాటల కోసం అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వారికో శుభవార్త! ఈనెల 24 న రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఆ తర్వాత ఇక రాజాసాబ్ ప్రమోషన్స్ జోరుగా మొదలవుతాయి.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.