
‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ‘ఫంకీ’ వచ్చే నెల 25న క్రిస్మస్ పండగకు విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాల వలన 2027, ఏప్రిల్ 3కి వాయిదా పడింది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ సినీ దర్శకుడుగా నటిస్తుండగా, హీరోయిన్ కాయడు లోహర్ ఆ సినీ నిర్మాతగా నటిస్తున్నారు.
నిర్మాత, దర్శకుడు ప్రేమలో పడి, ఇద్దరూ కీచులాడుకుంటూ సినిమా తీస్తే ఎలా ఉంటుందో, ఆ కామెడీకి, రోమాన్స్ ఎలా ఉంటుందో కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ చూస్తేనే అర్ధమైంది. కనుక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్ సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఫంకీ నిర్మిస్తున్నారు. 2027, ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.