
ప్రముఖ నటి నయనతార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె భర్త విగ్నేష్ శివన్ ఆమెకు సుమారు రూ.10 కోట్లు ఖరీదైన విలాసవంతమైన బ్లాక్ బ్యాడ్జి-స్పెక్టర్ కారు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు. నేటితో ఆమె 41వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆమెకు ఈ ఖరీదైన బహుమతి ఇచ్చారు.
అయితే ఈవిదంగా కార్లు బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2023లో ఆమెకు సుమారు రూ. 3కోట్లు ఖరీదైన మెర్సిడిజ్ బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారు. మళ్ళీ మరుసటి సంవత్సరం అంటే 2024లో రూ. 5 కోట్లు ఖరీదు గల మెర్సిడిజ్ బెంజ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు. ఈసారి ఏకంగా రూ.10 కోట్లు ఖరీదైన కారు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు.
నయనతార-విగ్నేష్ శివన్ దంపతులు తమ ఇద్దరి పిల్లలతో కారు ముందు నిలబడి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దాని తర్వాత బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో చారిత్రిక నేపధ్యంతో తీయబోతున్న సినిమాలో నటించబోతున్నారు. ఇవి కార్యక్రమంలో మరో ఏడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.