
డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మాతగా మారి తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో చక్కటి ప్రేమ కధ ‘రాజు వెడ్స్ రాంబాయి’ తీశారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కాబోతోంది. హైదరాబాద్, దసపల్లా హోటల్లో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి యువ నటుడు కిరణ్ అబ్బవరం ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.
ఇది తెలంగాణలో జరిగిన నిజమైన ప్రేమ కధ. ఈ సినిమాలో అఖిల్, తేజస్వి రావ్ జంటగా నటించారు. శివాజీ రాజ, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సాయిలు కంపాటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: వజీద్ బేగ్, ఎడిటింగ్:నరేష్ అడుప , ఆర్ట్: గాంధి నడికుడికర్, స్టంట్స్: స్టంట్స్ శేఖర్ చేశారు.
దోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్లపై రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాలో ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కూడా ప్రధాన భాగస్వామిగా ఉంది.