.jpg)
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న ‘వారణాశి’లో విలన్‌గా కుంభగా ప్రముఖ మళయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామోజీ ఫిల్మ్ ఛాంబర్ సిటీలో టైటిల్ గ్లిమ్స్ విడుదల చేస్తున్నప్పుడు విలన్ రణ కుంభ థీమ్ సాంగ్ కూడా వినిపించారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దానినీ అప్‌లోడ్ చేసి అభిమానులకు అందించారు.
చైతన్య ప్రసాద్ వ్రాసిన ఈ థీమ్ సాంగ్‌ని ఎంఎం కీరవాణి స్వరపరిచి సంగీతం అందించగా ఆదిత్య అయ్యంగార్ పాడారు
ఈ సినిమాలో మందాకినిగా బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి నిర్మిస్తున్న వారణాశికి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్ చేస్తున్నారు.
ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి, ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్,లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు.
వారణాశి 2027 వేసవిలో విడుదలవుతుంది.