
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అఖండ-2 వచ్చే నెల 5న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అఖండ-2 నుంచి ‘జాజికాయ, జాజికాయ... అంటూ సాగే రెండో పాట నిన్న విశాఖలో బాలకృష్ణ విడుదల చేశారు.
కాసర్ల శ్యామ్ వ్రాసిన ఈ ఊరమాస్ పాటకి తమన్ రోటీన్ మాస్ బీట్ అందించగా బ్రిజేష్ సంధ్య, శ్రేయ గోశల్ కలిసి హుషారుగా పాడారు.
ఇంతవరకు అఖండ-2 నుంచి వచ్చిన ఫోటోలు, గ్లిమ్స్, పోస్టర్స్ అన్నిటిలో బాలకృష్ణ ‘అఘోర’గా విశ్వరూపం చూపితే, ఇది బోయపాటి సినిమా కనుక ఇలాంటి ఊర మాస్ సాంగ్ కూడా తప్పక ఉంటుందని జాజికాయ జాజికాయతో స్పష్టం చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎమ్మెల్యేలు.తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంతలతో కలిసి పాన్ ఇండియా మూవీగా అఖండ-2 నిర్మించారు.