సంబంధిత వార్తలు

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె తిరువీర్‌కు జోడీగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా మహేశ్వర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంగీతం: భరత్ మంచిరాజు; కెమెరా: సిహెచ్ కుషేందర్; ఆర్ట్: తిరుమల ఎం తిరుపతి; ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్ చేస్తున్నారు.