
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తీస్తున్న ‘పెద్ది’ నుంచి మొన్న ‘చికిరి చికిరి’ అంటూ వదిలిన ప్రమో సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. చిటికెలు వేస్తూ మోకాళ్ళపై నుంచి కొద్దిగా లేచి రామ్ చరణ్ ఇచ్చిన డాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు విడుదల చేసిన పూర్తి పాట ఇంకా అద్భుతంగా ఉంది.
చిన్న చిన్న పదాలతో బాలాజీ వ్రాసిన పాట అద్భుతంగా ఉందనుకుంటే దానిని ఏఆర్ రహ్మాన్ స్వరపరిచిన తీరు, ఇచ్చిన సంగీతం ఇంకా అద్భుతంగా ఉంది. ఈ పాటని మోహిత్ చౌహాన్ అంతే అద్భుతంగా పాడగా రామ్ చరణ్ ఇంకా అద్భుతంగా డాన్స్ చేశారు.
ఈ ఒక్క పాటతోనే పెద్ది సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడం ఖాయం. పాట విడుదల చేసిన గంటలోపే 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయనే ఏ స్థాయిలో వైరల్ అవుతోందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా నటిస్తున్న జాన్వీ కపూర్‌ని కూడా ఈ పాటలో చూపారు. ఈ సినిమాలో కోచ్ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్, ఇంకా జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.