మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత సినీ పరిశ్రమకు తిరిగొచ్చిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వస్తూనే తన పద్దతిలో వ్యంగ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. కే-ర్యాంప్ సక్సస్ మీట్లో ముఖ్య అతిధిగా వచ్చినప్పుడు విజయ్ దేవరకొండని పరోక్షంగా ప్రస్తావిస్తూ, “ఒక సినిమా హిట్ కాగానే లూజ్ ఫ్యాంట్, చెప్పులు వేసుకొని, రాత్రిపూట కూడా కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతూ వాట్సప్ బాయ్స్ అంటూ వేదికపై కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడుతుంటారు.
ఒక సినిమా హిట్ కాగానే రాజమౌళినో లేదా సుకుమార్ లేదా అనిల్ రావిపూడినో తీసుకు రమ్మంటారు. కానీ సినీ పరిశ్రమలో గడ ఫాదర్ లేకుండా ఎదిగి సొంతంగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు కొత్త దర్శకులకు అవకాశం కల్పించి వారి ప్రతిభని అందరూ గుర్తించేలా చేశారు,” అంటూ ఇంకా ఏవేవో మాట్లాడారు.
బండ్ల గణేష్ వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో బండ్ల గణేష్ దిగిరాక తప్పలేదు. ఈరోజు అయన “ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.
నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే,” అని ట్వీట్ చేశారు.
కానీ వస్తూనే నోటికి పని చెప్పినందుకు వస్తూనే క్షమాపణలు చెప్పుకొని తల దించుకోవలసి వచ్చింది కదా? ఇది అవసరమా?

ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు.
నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.

మీ బండ్ల గణేష్
— BANDLA GANESH. (@ganeshbandla) November 5, 2025