
‘పెద్ది’ సిగ్నేచర్ షాట్‌తోనే ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేలా చేశారు దర్శకుడు బుచ్చిబాబు సనా. కాస్త ఆలస్యమైనా వారి అంచనాలకు మించి ఉండే అప్‌డేట్ ఇచ్చారు బుచ్చిబాబు.
పెద్ది నుంచి ‘చికిరి చికిరి’ అంటూ పాట ప్రమోని నేడు విడుదల చేశారు. పూర్తిపాట ఈ నెల 7న విడుదల చేయబోతున్నారు. ప్రమోలో రామ్ చరణ్ మోకాళ్ళపై కూర్చొని పైకి లేవకుండా ఇచ్చిన డాన్స్ మూవ్ మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. రామ్ చరణ్ కనుకనే అంత అలవోకగా చేయగలిగారని అభిమానులు చెప్పుకుంటున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో గ్రామీణ క్రికెట్ ఆటగాడిగా నటిస్తున్న రామ్ చరణ్‌కి కోచ్ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజునాడు పెద్ది విడుదల కాబోతోంది. కానీ కుదిరితే ఒక రోజు ముందుగానే శ్రీరామ నవమి నాడు పెద్ది విడుదల చేస్తామని దర్శకుడు బుచ్చిబాబు చెప్పారు.