నవీన్ పోలిశెట్టి కూడా పాడేస్తున్నాడే!

సినీ పరిశ్రమలో హీరోలు పాటలు పాడటం కొత్తకాదు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్ పోతినేని వంటి పలువురు పాడారు, తాజాగా నవీన్ పోలిశెట్టి కూడా ఈ జాబితాలో చేరారు.    

మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఓ పాట పాడారు. ఇటీవలే ఈ పాట రికార్డింగ్ పూర్తయింది.    

వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌కి ఇంకా చాలా సమయం ఉంది. కానీ త్వరలోనే ఈ పాట విడుదల చేసే అవకాశం ఉంది.         

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేస్తున్నారు.