ఎన్‌సీ-24: మీనాక్షి ఫస్ట్ లుక్ పోస్టర్‌

కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఎన్‌సీ-24 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న అడ్వంచర్ ట్రెజర్ హంట్ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. 

ఈ సినిమాలో యువ హిందీ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ నటించబోతున్నారు. ఇతను ఇప్పటికే పలు హిందీ సినిమాలలో నటించాడు. గత ఏడాది విడుదలైన సూపర్ హిట్ హిందీ సినిమా ‘లాఫతా లేడీస్’లో నటించి మెప్పించాడు. ఇప్పుడు తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నాడు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు.