శేఖర్ కమ్ముల స్పూర్తితోనే..!

కమర్షియల్ బాటలో వెళ్తున్న తెలుగు సినిమాకు క్లాసిక్ టచ్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. సినిమాలు కేవలం కమర్షియల్ అంశాలతోనే కాదు సున్నితమైన భావోద్వేగాలతో కూడా తీయొచ్చని ఆయన తీసిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ సక్సెస్ లు చెప్పకనే చెప్పాయి. అయితే ఆ స్పూర్తితోనే తను కూడా జయమ్ము నిశ్చయమ్మురా తీశాను అంటున్నాడు దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి. వర్మ, జె.డి.చక్రవర్తి లాంటి దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్నా సినిమా తీయాలంటే డబ్బులు కావాలని యూ.ఎస్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసి మళ్లీ వచ్చి జయమ్ము నిశ్చయమ్మురా సినిమా తీశాడు.

తనకు శేఖర్ కమ్ములనే స్పూర్తిని అంటున్నాడు శివరాజ్. అఫ్కోర్స్ ఇలాంటి వారికందరికి శేఖర్ కమ్ములనే దారి చూపించాడు లేండి. అయితే వ్యక్తిగతంగానే కాదు జయమ్ము నిశ్చయమ్మురా టేకింగ్ లో కూడా శివరాజ్ కమ్ములను ఫాలో అయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా అందరిని మెప్పిస్తుంది. కమెడియన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా ఫులెంత్ రోల్ లో అందరిని అలరించాడు.   

సినిమా అన్ని విభాగాల్లో నడిపించిన దర్శకుడు ప్రతిభ మెచ్చుకోదగినది. ఇక తను అసిస్టెంట్ గా చేశాడు కాబట్టి వర్మ, జెడిల స్పూర్తి కూడా తన పైన పడింది అంటున్నాడు శివరాజ్. మొత్తానికి తెలుగు సినిమాకు మరో టేస్టున్న దర్శకుడు దొరికాడనే చెప్పాలి.