వరుణ్ తేజ్ తో పటాస్ డైరక్టర్..!

మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో సూపర్ ఫాంలో ఉన్నాడు. కాలికి గాయంతో కొన్ని రోజులు మిస్టర్ సినిమా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక శేఖర్ కమ్ముల ఫిదా కూడా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ తో సక్సెస్ ఫుల్ డైరక్టర్ చందు మొండేటి సినిమాకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వినడం ఓకే చేయడం అంతా జరిగింది. ఇక ఇప్పుడు మరో క్రేజీ డైరక్టర్ అనీల్ రావిపూడితో సినిమా తీయాలని చూస్తున్నాడట.

పటాస్, సుప్రీం సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ అనీల్ రావిపూడి రామ్ తో సినిమా ఓకే అయినా ఎందుకో సడెన్ గా ఆగిపోయింది. ఇక ఎన్టీఆర్ కు కథ చెప్పినా నచ్చకపోవడంతో ప్రస్తుతం వరుణ్ తేజ్ కు స్టోరీ చెప్పే పనిలో ఉన్నాడట. ఎలాగు సక్సెస్ ఫుల్ డైరక్టర్ కాబట్టి వరుణ్ తేజ్ కూడా నో అనే ఛాన్స్ లేదు. తీసిన రెండు సినిమాలను కమర్షియల్ గా వర్క్ అవుట్ చేసిన అనీల్ మూడో సినిమా కూడా హిట్ కొట్టి తన స్టామినా చాటాలని చూస్తున్నాడు. మరి వరుణ్ తేజ్ ఆ అవకాశం ఇస్తాడో లేదో త్వరలో తెలుస్తుంది.