వెంకీ బర్త్ డే గిఫ్ట్ అదేనా..!

సెలబ్రిటీ బర్త్ డే వచ్చిందంటే చాలు తాము నటిస్తున్న సినిమాల అప్డేటెడ్ న్యూస్ తో అభిమానులకు గిఫ్ట్ అందిస్తారు హీరోలు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ కూడా అదే దారిలో డిసెంబర్ 13న తన పుట్టినరోజు నటిస్తున్న గురు టీజర్ ను రిలీజ్ చేయనున్నారట. మాధవన్ హీరోగా సాలా ఖదూస్ గా హింది, తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో అదే దర్శకురాలు డైరెక్ట్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో మాత్రుకలో నటించిన బాక్సింగ్ శిష్యురాలు రితికా సింగ్ నటిస్తుంది.  

కొద్ది కాలంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ వచ్చిన వెంకటేష్ రీసెంట్ గా వచ్చిన బాబు బంగారంతో మళ్లీ తన స్టైల్ ను చూపించి మెప్పించాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ స్టామినా ఏంటో చూపించింది. ఇక గురు సినిమా కూడా దాదాపు పూర్తయినట్టే జనవరి 26 ణ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ కిశోర్ తిరుమల డైరక్షన్లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.