
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 4న పోలీస్ లైన్స్ లో జరుగనుంది. ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి ఆశగా ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్ వెన్యూ తెలుసుకుని అందరు షాక్ అవుతున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ లైన్స్ పెద్దదే కాని అక్కడైకి చేరుకోవడమే పెద్ద రిస్క్. అసలే చిన్న రోడ్డు అదిగాక మెట్రో పనులు జరుగుతుండటంతో మరి రద్ది ఎక్కువైంది. అందుకే ఫ్యాన్స్ కాస్త ఆలోచనలో పడ్డారు.
ఈవెంట్ అందులో పెట్టిన చరణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారని మాత్రం ఆలోచించలేదని తెలుస్తుంది. ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్ లో సాంగ్స్ వదిలిన చెర్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఏదో తూతూ మంత్రంగానే కానిచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలైతే ముందు విజయవాడ ఆ తర్వాత వరంగల్ అంటూ సాగిన ఈ చర్చలు చివరకు హైదరాబాద్ లోనే చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో సినిమాలో విషయం ఏంటో చూపించిన చెర్రి ఇక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినిమాకు సంబందించిన మరిన్ని డీటేల్స్ తెలియచేస్తారట.
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందించారు.