రామ్ చరణ్‌-సుకుమార్ సినిమా ఫిబ్రవరి నుంచి షురూ

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌-సుకుమార్ కాంబినేషన్‌లో 2018లో వచ్చిన ‘రంగస్థలం’ ఎప్పటికీ మరిచిపోలేని క్లాసిక్ సినిమాగా నిలిచిపోతుంది. కనుక మళ్ళీ వారిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే చాలా భారీ అంచనాలు ఏర్పడుతాయి. 

ప్రస్తుతం రామ్ చరణ్‌ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానతో ‘పెద్ది’ పూర్తి చేస్తున్నారు. ఇది పూర్తికాగానే ఫిబ్రవరిలో రామ్ చరణ్‌-సుకుమార్ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని రామ్ చరణ్‌ టీమ్‌ ప్రకటిస్తూ ‘హార్స్ మ్యాన్’ అంటూ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. దీనిలో రామ్ చరణ్‌, వెనుక అనేక మంది గుర్రాలపై సవారీ చేస్తున్నట్లు చూపారు. దానిని బట్టి చూస్తే కౌబాయ్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీపావళికి పెద్దితో పాటు ఈ సినిమా వివరాలు ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.