
సింపుల్ సుని దర్శకత్వంలో ‘గత వైభవ’ తెలుగులో విడుదలవుతున్న కన్నడ సినిమా నుంచి వర్ణమాల లిరికల్ సాంగ్ విడుదలైంది. ఇదొక పౌరాణిక, చారిత్రిక నేపధ్యంతో స్వాతంత్ర్యం రాక పూర్వం వాస్కోడా గామా భారత్ యాత్ర వరకు కర్ణాటకలో ఓ మారుమూల గ్రామంలో సాగే కధ.
ఈ సినిమాలో ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించారు. సుధా వేలవాడి, కిషెన్ బిలగాలి, కృష్ణ హెబ్బాలే, కృష్ణ జోరాపూర్ ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, పాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: సింపుల్ సుని; కెమెరా: విలిం జే డేవిడ్; స్టంట్స్: చేతన్ డి’సౌజ; కోరియోగ్రఫీ: కులభూషణ్, మధు; ఎడిటింగ్: ఆషిక్ కుసుగొల్లి చేశారు.
సేర్వేగర సిల్వర్ స్క్రీన్స్, సునీ సినిమాస్ బ్యానర్లపై దీపక్ తిమ్మప్ప, సుని కలిసి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదల కాబోతోంది.