మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహరాజ్ రవితేజ కెరీర్‌లో 75వ సినిమా ‘మాస్ జాతర’ ఆగస్ట్ 27న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈరోజు దసరా పండగనాడు రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే నేడు మాస్ జాతర అక్టోబర్‌ 31న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి వరుసగా మాస్ జాతర ప్రమోషన్స్ మొదలవుతాయని ముందే చెప్పారు.  

ప్రముఖ సినీ రచయిత భాను భోగవరపు ఈ సినిమాతో  దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. మాస్ జాతరలో రవితేజకు జోడీగా డాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటించారు. 

ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మిస్తున్నారు.