అఖిల్ షూటింగ్ స్టార్ట్..!

అదేంటి ఎలాంటి హడావిడి లేకుండా అఖిల్ రెండో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేశారా విక్రం కుమార్ డైరక్షన్లో అఖిల్ సినిమా ముహుర్తం పెట్టేశారా అని డౌట్లు రావొచ్చు. అఖిల్ స్టార్ట్ చేసింది సినిమా షూటింగ్ కాదు యాడ్ షూటింగ్. మౌంటెన్ డ్యూకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న అఖిల్ దానికి సంబందించిన ఓ యాడ్ లో పాల్గొనాల్సి ఉంది. ఐలాండ్ లో ఈరోజు నుండి యాక్షన్ తో కూడిన యాడ్ షూట్ చేయనున్నారట. 

అఖిల్ మొదటి సినిమా వినాయక్ డైరక్షన్లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అయిన అఖిల్ లోని ప్రతిభ అందరి మెప్పు పొందేలా చేసింది. ఇక సెకండ్ సినిమా కోసం ఎంతోమంది దర్శకులతో చర్చలు జరిపిన అఖిల్ ఫైనల్ గా విక్రం కె కుమార్ ను ఓకే చేశాడు. త్వరలో స్టార్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ కోసం అఖిల్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నాడట. డిసెంబర్ 9న శ్రేయా భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరుపుకోనున్న అఖిల్ ఆ తర్వాత వారం గ్యాప్ ఇచ్చి సినిమా స్టార్ట్ చేయనున్నాడట.