
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సూపర్ హిట్ టాక్ వచ్చింది.... నిర్మాతలకి కలక్షన్స్ కనక వర్షం కురిపిస్తోంది. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ని అంత గొప్పగా ఆవిష్కరించి చూపినందుకు అభిమానులు సుజీత్‌కి కూడా అభిమానులుగా మారిపోయారు.
ఓజీ తర్వాత సుజీత్ ఇప్పుడు నాచురల్ స్టార్ నానితో మరో యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీని గ్రాఫిక్ వీడియో కూడా విడుదల చేశారు.
ఈ సినిమాకి ఎల్లుండి దసరానాడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరుగబోతున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించబోతున్నారు.
ఈ సినిమా టైటిల్ ‘బ్లడీ రోమియో’ అని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఓజీకి పని చేసిన సాంకేతిక నిపుణులలో చాలా మంది ఈ సినిమాకి కూడా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా పూజా కార్యక్రమం జరిగితే పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
Can't wait to witness the MADNESS created by you @Sujeethsign with @NameisNani 🔥👊 .#BloodyRomeo #Nani #Sujeeth pic.twitter.com/4Jcs02CnbX
— Nani (@jst__nani) September 2, 2025