బ్యాడ్ బాయ్ కార్తీక్ కోసం అమెరికా నుంచి వచ్చాను

యువహీరో నాగశౌర్య-రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో వస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్‌’ సినిమా నుంచి ‘మైడియర్ జనతా...” అంటూ సాగే పాటని వినాయక చవితినాడు విడుదల చేశారు. ఎల్లుండి దసరా పండగ సందర్భంగా ఒక రోజు ముందుగానే ఐటెం సాంగ్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

బుధవారం మధ్యాహ్నం 11.45 గంటలకు ‘అమెరికా నుంచి వచ్చాను... అంటూ స్నేహ గుప్తా చేసిన ఐటెం సాంగ్ విడుదల చేస్తామని తెలియజేస్తూ, పోస్టర్‌, ప్రమోషన్స్‌ విడుదల చేశారు.   

ఈ సినిమాలో విధి యాదవ్, సముద్ర ఖని, సాయి కుమార్, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్:1గా నిర్మిస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్‌ సినిమాకి కధ, దర్శకత్వం:  రామ్ దేశిన (రమేష్), సంగీతం: హ్యారీస్ జయరాజ్, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రామాంజనేయులు, స్టంట్స్: సుప్రీం సుందర్ పృధ్వీ, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్‌ చింతలపూడి, డా. అశోక్ కుమార్‌ చింతలపూడి కలిసి నిర్మిస్తున్నారు.