
మహాకాళి సినిమా గురించి చెప్పుకునే ముందు దీనికి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కధ అందించారని, దీనిని ఆయన్నా సొంత బ్యానర్ ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో నిర్మిస్తున్నారని చెప్పుకోవడం చాలా ముఖ్యం.
ఈ సినిమా వెనుక ప్రశాంత్ వర్మ ఉన్నాడనే ఒక్క మాట చాలు... భారీ అంచనాలు ఏర్పడుతాయి. అతను అందించిన కధతో పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో భద్రకాళిని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్‌లో నటుడు అక్షయ్ ఖన్నా రాక్షస గురువు శుక్రాచార్యుడుగా నటిస్తున్నారు. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఆ వేషంలో అక్షయ్ ఖన్నాని గుర్తుపట్టడం కష్టం. నిజానికి ప్రశాంత్ వర్మ సినిమాలలో నటీనటులకంటే వారి పాత్రలే ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి. కనుక చావా సినిమాలో ‘ఔరంగజేబు’గా నటించి మెప్పించిన అక్షయ్ ఖన్నా ఈ సినిమా శుక్రాచార్యుడుగానే అందరికీ గుర్తుండిపోవచ్చు.
ఆయన పాత్ర పరిచయం చేస్తూ, “దేవతల నీడలో కాంతివంతమైన తిరుగుబాటు జ్వాలగా ఎదిగిన శుక్రాచార్యుడు...’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్టర్ వేశారు.
ఈ సినిమాని ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియో కూడా అద్భుతంగా ఉంది. ఆర్‌కేడి స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.