
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ వంటి హేమాహేమీలతో వచ్చిన బాహుబలి-1,2 అనేక రికార్డులు సృష్టించాయి. నేటికీ ప్రేక్షకులు వాటిని ఓటీటీలలో చూసి ఆనందిస్తూనే ఉన్నారు కూడా.
ఆ రెండు సినిమాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఒకే సినిమాగా అందించబోతున్నారు రాజమౌళి. అలాగని ఈ సినిమా 4-5 గంటలు ఉండదు. రెండు భాగాలను ఎడిట్ చేసి 2.30 -3 గంటలకు కుదించినట్లు సమాచారం.
అయినప్పటికీ ఇది చూసిన సినిమాయే కనుక ప్రేక్షకులను మళ్ళీ థియేటర్లకు రప్పించడం కష్టమే. కనుక దీనిలో తప్పనిసరిగా ఏదైనా ప్రత్యేకత ఉండాలి.
అక్టోబర్ 31న బాహుబలి ది విడుదల కాబోతోందని సోషల్ మీడియాలో తెలియజేస్తూ, ఇది ఈ సినిమాను మరోసారి చూడటం మాత్రమే కాదు అంతకు మించి... అని హింట్ ఇచ్చారు. బహుశః ఈ సినిమా మేకింగ్ వీడియో లేదా షూటింగ్ విశేషాలు ఏమైనా జోడిస్తారేమో?