రాజాసాబ్ ట్రైలర్‌.. మామూలుగా లేదుగా!

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘రాజాసాబ్’ ట్రైలర్‌ వచ్చేసింది. మారుతి మార్క్ హర్రర్ కామెడీకి ప్రభాస్ వంటి స్టార్ హీరో టైమింగ్ సరిగ్గా సెట్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమా ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం భూత్ బంగ్లా... దానిలో దెయ్యాలు, ఆత్మలతో కాలక్షేపం చేయకుండా అద్భుతమైన గ్రాఫిక్ వర్క్స్ కూడా జోడించడంతో ట్రైలర్‌ మరో స్థాయిలో ఉంది. ఇక ప్రభాస్ యాక్షన్, కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది. 

హిందీ బయ్యర్స్ అభ్యర్ధన మేరకు డిసెంబర్‌ 5 లేదా 6 తేదీలలో రాజాసాబ్ వస్తారంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. కానీ ట్రైలర్‌లో సంక్రాంతి పండగకు ముందు అంటే జనవరి 9న రాబోతున్నరంటూ స్పష్టం చేశారు.  

 ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు. 

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.