అది తమన్నా సీక్రెట్..!

మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలిలో అవంతిక పాత్ర చేశాక కెరియర్లో అనుకోని రేంజ్ కు వెళ్లింది. ఇక ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీసెంట్ గా అభినేత్రిగా తమన్నా పర్వాలేదు అనిపించుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ తమిళ సినిమా తప్పించి తమన్నా సైన్ చేసిన సినిమాలేవి లేవు. అయినా సరే తమన్నా ఏమాత్రం జోరు తగ్గించట్లేదు. సినిమాలు లేకపోయినా ఈ జోష్ కు కారణం ఏంటి అంటే త్వరలో భారీ ప్రాజెక్ట్స్ ఎనౌన్స్ మెంట్స్ జరుగనున్నాయట. వాటిలో తమన్నానే హీరోయిన్ అని ఫిక్స్ అయ్యిందట. అందుకే తమన్నా ఇలా సైలెంట్ గా ఉందని అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తర్వాత తీసే సినిమాలో తమన్నా సెలెక్ట్ చేస్తారని టాక్.. పవన్ కళ్యాణ్ కూడా తమన్నాతో మరోసారి చేయాలని చూస్తున్నాడట. అంతేకాదు మహేష్ కూడా కుదిరితే తమన్నాతో రొమాన్స్ కు రెడీ అన్నట్టు టాక్. సో ఈ క్రేజీ కాంబినేషన్స్ అన్ని కుదిరితే మళ్లీ తమన్నా క్రేజ్ సంపాదించినట్టే. తన మిల్కీ అందాలతో ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క ఐటం సాంగ్స్ చేస్తున్న ఈ అమ్మడు అనుకున్న సినిమాలు చేతిలోకి వస్తే కనుక ఇక తిరుగుండదని చెప్పొచ్చు.