ఈసారి బ్యాండ్ మేళంతో రోషన్, శ్రీదేవి

 నాచురల్ స్టార్ నాని నిర్మించిన సూపర్ హిట్ సినిమా ‘కోర్టు’లో జంటగా నటించిన రోషన్, శ్రీదేవి ఆ ఒక్క సినిమాతో మంచి ఫేమస్ అయిపోయారు. వారిద్దరూ మళ్ళీ ‘బ్యాండ్ మేళం’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స‌తీశ్ జువ్వాజీ కధ, దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదలైంది. ఈసారి తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో ఈ సినిమా తీస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌తో స్పష్టమైంది. సినిమా పేరు ‘బ్యాండ్ మేళం’తోనే కధ చూచాయగా చెప్పేశారు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు బ్యాండ్ మేళంలో పాటలు పాడే జంటగా రోషన్, శ్రీదేవి నటిస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లోనే చిన్న హింట్ కూడా ఇచ్చేశారు.               

ఈ సినిమాలో సాయి కుమార్‌ ముఖ్యపాత్ర చేస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ సొంత బ్యానర్ కోన ఫిలిమ్‌ కార్పోరేషన్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్న బ్యాండ్ మేళంకు సంగీత దర్శకుడు: విజ‌య్ బుల్గానిన్‌, పాటలు: చంద్రబోస్,  స్క్రీన్ ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు, కెమెరా: సతీష్ ముత్యాల, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు.