చందు మొండేటి దర్శకత్వంలో వాయుపుత్ర!

తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో కొత్త ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం పీరియాడికల్ సినిమాలు, దెయ్యాలు భూతాలు, సోషియో ఫ్యాంటసీ సినిమాలు, సాహసవీరుల సీజన్ నడుస్తోంది.

ఇటీవల విడుదలైన ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు యానిమేషన్ సీజన్ మొదలైనట్లే ఉంది. ముందుగా చందు మొండేటి దర్శకత్వంలో ‘వాయుపుత్ర’ పేరుతో హనుమంతుడి వీరోచిత గాధని తెరకెక్కించబోతున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నేడు ప్రకటించింది. రెండు టైటిల్ పోస్టర్స్ కూడా విడుదల చేసింది.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది దసరా పండగకి ఈ సినిమా విడుదల చేస్తామని టైటిల్‌ పోస్టర్లోనే ప్రకటించారు.