విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా సినిమా

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల‌తో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక ఆ తర్వాత ప్రేమలో పడటంతో వారి జోడీ మరింత స్పెషల్ అయ్యింది. మళ్ళీ చాలా కాలం తర్వాత వారిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది బ్రిటిష్ కాలం నాటి పీరియాడికల్ మూవీ అని సమాచారం. కనుక ఈ సినిమాలో దేశభక్తి, భావోద్వేగాలు, పోరాటాలు, రష్మిక జంటగా ఉంది కనుక మంచి రోమాన్స్ అన్నీ సమపాళ్ళలోనే ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం. కానీ ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.