విశాఖ ఆర్‌కే బీచ్‌లో మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న ‘మిరాయ్‌’ ఈ నెల 12న విడుదల కాబోతోంది. హనుమాన్ తర్వాత తేజా సజ్జా చేస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించేందుకు సినీ బృందం సిద్దమవుతోంది. ఈ ఆదివారం విశాఖపట్నం, ఆర్‌కే బీచ్‌లో సాయంత్రం 5 గంటల నుంచి మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది. 

ఈ సినిమాలో ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ దుష్టశక్తి (మంచు మనోజ్)ని ‘మిరాయ్’ అనే అతీతశక్తులు కలిగిన ఓ ఆయుధంతో ‘సూపర్ యోధ’ (తేజా సజ్జా) ఏవిదంగా అడ్డుకుంటాడనేది చూపించబోతున్నారు. 

ఈ సినిమాలో రీతికా నాయక్ తేజ సజ్జకు జోడీగా నటిస్తుండగా మంచు మనోజ్ దుష్టశక్తుల నాయకుడుగా నటిస్తున్నాడు. జగపతిబాబు, శ్రీయ శరణ్, జయరాం, రాజేంద్రనాధ్ జుట్శీ, పవన్ చోప్రా, తాంజ కెల్లర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకి దర్శకత్వం, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: గౌర హరి, ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగెల చేస్తున్నారు. 

మిరాయ్ సినిమాని సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్‌లో నిర్మిస్తున్న మిరాయ్ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.