
ఒకప్పుడు చక్కటి కామెడీ సినిమాలు చేస్తూ అందరినీ అలరించిన అల్లరి నరేష్ అల్లరి చేయడం మానేసి చాలా సీరియస్ పాత్రలు చేస్తున్నారు. నరేష్‌ని అలా చూడటం కాస్త కష్టం కాస్త ఇష్టంగానే ఉన్న అందరూ అయన మళ్ళీ అల్లరి చేయాలనే కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకు ‘ఆల్కహాల్’ సినిమాతో నరేష్ మళ్ళీ అల్లరి చేయడం మొదలుపెట్టారు. ఈరోజు విడుదలైన ఆల్కహాల్ టీజర్ చూస్తే అది అర్ధమవుతుంది.
మెహెర్ తేజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రుహాని శర్మ నరేష్ కి జోడీగా నటిస్తున్నారు. అల్లరి నరేష్ ఆల్కహాల్ పార్టనర్స్‌గా సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి, హరితేజ, సూర్య భగవాన్ దాస్, ఫ్లోరా జాకోబ్ ఉన్నారు.
ఈ ఆల్కహాల్ పార్టీకి సంగీతం: గిబ్రన్, కెమెరా: జిజూ సన్నీ, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ సినిమాస్ బ్యానర్లపై నాగావంశి నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 1న విడుదల కాబోతోంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/YQQBkmDJQd0?si=oiCuy2iUQKoh8h-J" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>