
మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే జంటగా నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి పప్పీ షేమ్ అంటూ సాగే రెండో పాట ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఆ పాటకు సంబంధించి ఓ పోస్టర్ వేశారు.
1970-80ల కాలంలో హీరోల అభిమానులు ఏవిదంగా ఉండేవారో తెలియజేస్తూ సాగే “ఓ అభిమాని బయోపిక్ ఇది” అని దర్శకుడు మహేష్ బాపు ముందే చెప్పేశారు..
ఈ సినిమాలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోరే, ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మహేష్ బాబు బాపు, పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: సిద్ధార్థ్ నుని, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.