రాజమౌళి సినిమా అంటే షూటింగ్ పూర్తయ్యే వరకు అంతా రహాస్యమే. పెద్దగా అప్డేట్స్ కూడా ఇవ్వరు. కానీ ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతుంది కనుక ఆయన చేస్తున్న సినిమా విశేషాలు తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపుతుంటారు.
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ప్రస్తుతం కెన్యాలో ఎస్ఎస్ఎంబీ29 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజమౌళి ఆ దేశ క్యాబినెట్ కార్యదర్శి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసింది.
ఆయన ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎస్ఎస్ఎంబీ29 సినిమాని 120 దేశాలలో విడుదల చేయాలని రాజమౌళి టీమ్ అనుకుంటోందని తెలిపారు.
ఈ సందర్భంగా కెన్యా స్థానిక పత్రికలలో ఎస్ఎస్ఎంబీ29 గురించి మరో వార్త కూడా వచ్చింది. ఈ సినిమాని రాజమౌళి రెండు భాగాలుగా తీయబోతున్నారని పత్రికలలో పేర్కొన్నారు. దీని కోసం రాజమౌళి బృందం హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ సినీ ప్రమోషన్ ఏజన్సీతో ఒప్పందం చేసుకున్నారని కెన్యా పత్రికలు పేర్కొన్నాయి.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్‌లో విడుదల చేస్తామని రాజమౌళి ఇదివరకే చెప్పారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నారు. మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఎంఎం కీరవాణి, డైలాగ్స్: దేవాకట్ట అందిస్తున్నారు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం 2025, జనవరి 2న జరిగింది. 2027లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents.

Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64
— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025