
ఆల్కహాల్లో మునిగితేలుతున్న అల్లరి నరేష్ అంటే మద్యానికి బానిస అయ్యారని కాదు. ‘ఆల్కహాల్’ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారని! కానీ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో మాత్రం అల్లరి నరేష్ మద్యంలో మునిగినట్లు చూపారు.
మెహెర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుహాని శర్మ నరేష్ కి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆల్కహాల్ టీజర్ గురువారం నుంచి విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ సూటుబూటులో ఉన్న అల్లరి నరేష్ పోస్టర్ ఒకటి నేడు విడుదల చేసింది. అంటే ముందుగా టీజర్ ప్రమోషన్స్ విడుదల చేస్తుందేమో?
ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్, కెమెరా: జిజూ సన్నీ, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ సినిమాస్ బ్యానర్లపై నాగావంశి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 11న ఆల్కహాల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.