
రాజమౌళి-మహేష్ బాబుల ఎస్ఎస్ఎంబీ29 పాన్ ఇండియా స్థాయికి మించి పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం వివిద దేశాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులతో వివిద దేశాలలో చిత్రీకరిస్తున్నారు.
జూ.ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న (డ్రాగన్?) సినిమాని కూడా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు తీయబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ ఇదివరకు తీసిన సినిమాలలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, ఖాంశార వంటి సరికొత్త ప్రపంచాలను సృష్టించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఇప్పుడు జూ.ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా కోసం మెక్సికో, ఇటలీ లేదా మరో దేశంలో ప్రసిద్ది చెందిన మాఫియా ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. కనుక ఈ సినిమాలో కూడా కొందరు విదేశీ నటీనటులు ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026, జూన్ 25న విడుదల కాబోతోంది.