
నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కనుక అభిమానులు ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ముందుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తున్న ఓ పోస్టర్ విడుదల చేశారు. నల్లటి సూటు, బూటు, నెత్తిన టోపీతో ఓ క్లబ్లో పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తున్న ఫోటోతో పోస్టర్ విడుదల చేశారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సన్నివేశాల షూటింగ్ పూర్తయిపోయింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు వస్తారేమో?
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ నటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి‘ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మిస్తున్నారు.
ఇక సుజీత్ దర్శకత్వంలోలో చేస్తున్న ఓజీ నుంచి కూడా ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ రాబోతోంది. ముందుగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం ఓ పోస్టర్ విడుదల చేశారు. దానిలో కారు వెనుక డిక్కీ బోనేట్ మీద స్టైల్‌గా పవన్ కళ్యాణ్ కూర్చున్నట్లు ఫోటో వేశారు. ఈ నెల 25న ‘ఓజీ’ విడుదల కాబోతోంది.