అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో కన్నప్ప... ఎప్పటి నుంచంటే...

ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు, నుపూర్ సనన్ ప్రధానపాత్రలలో ‘కన్నప్ప’ జూన్ 27న పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో సుమారు రూ.200-300 కోట్లు ఖర్చు చేశారు. కానీ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో మంచు విష్ణుకి భారీగా నష్టం మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్‌ 4నుంచి అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం కాబోతోంది. కనుక ఓటీటీ ప్రేక్షకులు కూడా కన్నప్ప ఎలా ఉందో చూసి తెలుసుకోవచ్చు.   

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ,మోహన్ బాబు, ప్రభాస్‌, మోహన్ లాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, ముకుందన్, మధుబాల, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.. 

కన్నప్ప సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: మంచు విష్ణు, సంగీతం: స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న, ఎడిటింగ్: ఆంథోనీ గోన్‌సాల్వెజ్, స్టంట్స్: కెచ్చా కంఫక్డే, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, బృంద, గణేష్ చేశారు.

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మించారు.