
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్ర చేసిన ‘ఘాటి’ సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘ఘాటి’ నుంచి సిరిమర సిరిమర... అంటూ సాగే ఓ చక్కటి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈఎస్ మూర్తి వ్రాసిన ఈ పాటని సాగర్ నాగవెల్లి సంగీతం సమకూర్చగా హరిణి ఇవటూరి, సాయి చరణ్ బృందం ఆలపించింది.
‘ఘాటి’ ఫస్ట్-లుక్ పోస్టర్లో ‘విక్టిమ్, క్రిమినల్, లెజెండ్’ అనే ట్యాగ్ లైన్ జోడించడం ద్వారా దర్శకుడు క్రిష్ ఈ సినిమా కధనము మూడు ముక్కలో చెప్పేశారు. సాధారణ జీవితం గడుపుతున్న ఓ మహిళ ‘ఘాటి’ తుపాకులు పట్టి తిరుగుబాటు పోరాటాలు ఎందుకు చేయవలసి వచ్చిందనేది ‘ఘాటి’ కధ.
బస్సు కండక్టరుగా పని చేస్తున్న హీరోయిన్ అనుష్క తను ప్రేమించినవాడితో ఎంత సంతోషకరమైన జీవితం గడుపుతోందో దర్శకుడు క్రిష్ ఈ ఒక్క పాటలో చాలా చక్కగా చూపారు.
ఈ సినిమాకు దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, కధ: చింతకింది శ్రీనివాసరావు, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని, యాక్షన్: రామ్ కృషన్, ఎడిటింగ్: చాణక్య రెడ్డి తూరుపు చేశారు.
ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫైన్ ఆర్ట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. సెప్టెంబర్ 5న ఘాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.